Talasani Srinivas: ముషీరాబాద్ స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్ సందర్భంగా జరిగిన ఘటనపై మంత్రి తలసాని క్లారిటీ
Talasani Srinivas: ఈ ఘటనలో రాజేష్‌బాబుకు వెంటనే ఫోన్ చేసి క్షమాపణలు చెప్పాను
Talasani Srinivas: ముషీరాబాద్ స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్ సందర్భంగా జరిగిన ఘటనపై మంత్రి తలసాని క్లారిటీ
Talasani Srinivas: ముషీరాబాద్ స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్ సందర్భంగా జరిగిన ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ స్పందించారు. భైంసా ఏఎంసీ ఛైర్మన్ రాజేష్‌బాబుకు, గిరిజన సమాజానికి మంత్రి తలసాని క్షమాపణలు చెప్పారు. కేటీఆర్ వచ్చిన సందర్భంగా ఎక్కువ రద్దీ ఏర్పడిందని.. ఓ వ్యక్తి నా కాలు తొక్కుతూ ముందుకెళ్లాడంతో నా కాలుకు గాయం కావడంతోనే ఆ వ్యక్తిని నెట్టివేశానన్నారు . ఈ ఘటనలో రాజేష్‌బాబుకు వెంటనే ఫోన్ చేసి క్షమాపణలు చెప్పానని మంత్రి తలసాని అన్నారు. దీనిపై సోషల్ మీడియాలో పదే పదే ప్రచారం చేస్తున్నారని మంత్రి తలసాని అన్నారు. కొందరు కావాలని ఈ ఘటనను పెద్దగా చేయాలని ప్రయత్నం చేస్తున్నారని మంత్రి తలసాని ఆవేదన వ్యక్తం చేశారు.