Talasani: కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు

Talasani: అన్ని కులవృత్తులను ఆదుకుంటాం

Update: 2023-09-13 12:49 GMT

Talasani: కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు

Talasani: సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని, అన్ని కులవృత్తుల వారిని ఆదుకునే దిశగా పని చేస్తున్నారని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. గత ప్రభుత్వాలు రాష్ట్రంలోని మత్స్యకారులను మరిచిపోయాయని ఆరోపించారు. సీఎం కేసీఆర్ మత్స్యకార కుటుంబాలను ఆదుకోవడానికి 100 శాతం ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తున్నారని తెలిపారు.

సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజవర్గంలోని మర్కుక్ మండలంలోని కొండపోచమ్మ సాగర్‌లో ఏడో విడత ఉచిత చేపపిల్లల పంపిణీలో భాగంగా 14 లక్షల 35 వేల చేప పిల్లలను వదిలారు మంత్రి.... మటన్, చికెన్ కంటే చేపలతోనే ఆరోగ్యం బాగుంటుందని వైద్యులు చెబుతున్నారని వెల్లడించారు. చేపలు పట్టుకునే వారికి 4 లక్షల ఐడీ కార్డులు.. వేయి కోట్ల రూపాయలతో వాహనాలు, రెయిన్ కోర్టులను అందించామన్నారు.

Tags:    

Similar News