Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసు దర్యాప్తు వేగవంతం
ఎంపీ జితేందర్ రెడ్డి పీఏకు రెండోసారి నోటీసులు జారీ ఇవాళ విచారణకు రావాలని పేర్కొన్న పోలీసులు.
Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసు దర్యాప్తు వేగవంతం
Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసు దర్యాప్తు వేగవంతంగా సాగుతోంది. ఈ కేసులో ఢిల్లీలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి పీఏగా ఉన్న జితేందర్ రాజ్ కు పోలీసులు రెండోసారి నోటీసులు జారీ చేశారు. ఇవాళ తప్పనిసరిగా హైదరాబాద్ లో కేసు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. మరోవైపు శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసులో పలువురు టీఆర్ఎస్ నేతలను సస్పెండ్ చేశారు. మహబూబ్ నగర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అమరేందర్ రాజు, మహబూబ్ నగర్ మున్సిపల్ కౌన్సిలర్ రమాదేవితో పాటు టీఆర్ఎస్ నేతలు రాధా అమర్, శ్రీనివాసరాజులను బహిష్కరిస్తున్నట్లు టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజు ప్రకటించారు.