Srinivas Goud: కేసీఆర్ ఉన్నంత వరకు ఎవరికీ భయపడం
Srinivas Goud: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఓర్వలేకపోతోంది
Srinivas Goud: కేసీఆర్ ఉన్నంత వరకు ఎవరికీ భయపడం
Srinivas Goud: మునుగోడు ఓటమితో బీజేపీ అక్కసు వెళ్లగక్కుతోందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి జీఎస్టీ, పన్నుల విషయంలో లాభాలు ఇస్తుంటే.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో ఐటీ, ఈడీ దాడులు పేరుతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు అభివృద్ధి చెందుతుంటే.. అదిచూసి ఓర్వలేక IT, ED దాడులు చేయిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశంలో అంతర్భాగమైన విషయాన్ని మరిచిపోయి ఈప్రాంతాన్ని టార్గెట్ చేయడం దురదృష్టకరం అన్నారు.