Seethakka: సర్పంచ్ ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదు
Seethakka: పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హాట్ కామెంట్స్
Seethakka: సర్పంచ్ ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదు
Seethakka: సర్పంచుల అంశంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పందించారు. సర్పంచ్ ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదని.. దానిపై ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. సర్పంచుల నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని.. దాదాపు 12 వందల కోట్లు రూపాయలను ఇతర పనులకు వాడటంతో.. జీతాలు ఇచ్చేందుకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఇకపై ఉద్యోగులకు ప్రతినెల 5తేదీలోగా జీతాలు, పెన్షన్లు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. సర్పంచుల బిల్లులను చెల్లించేందుకు.. కృషి చేస్తున్నారు.. సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని మంత్రి సీతక్క తెలిపారు.