Satyavathi Rathod: హైదరాబాద్‌లో మహిళా మోటార్ డ్రైవింగ్ ట్రాక్ ఓపెన్
Satyavathi Rathod:కూకట్‌పల్లిలో ప్రారంభించిన మంత్రి సత్యవతి రాథోడ్
Satyavathi Rathod:హైదరాబాద్‌లో మహిళా మోటార్ డ్రైవింగ్ ట్రాక్ ఓపెన్
Satyavathi Rathod: హైదరాబాద్ కూకట్‌పల్లిలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో మహిళా మోటార్ డ్రైవింగ్ ట్రాక్, సీసీరోడ్లను మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. మహిళల ఆత్మ విశ్వాసo పెంపోందించేలా మోటారు డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమం మొదలుపెట్టడం ఒక శుభపరిణామమని సత్యవతి అన్నారు. రాష్ట్రంలోని మహిళల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని మంత్రి సత్యవతి అన్నారు. తల్లిదండ్రులు తమ బిడ్డల కోసం ఏ విధంగా ఆలోచిస్తారో అదేవిదంగా ముఖ్యమంత్రి KCR మహిళల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని అన్నారు. అందుకే మహిళల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టినట్లు ఆమె గుర్తుచేశారు.