Satyavathi Rathod: బయ్యారం ఫ్యాక్టరీ తెలంగాణ హక్కు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి సత్యవతి ఫైర్..
Satyavathi Rathod: ఫ్యాక్టరీ ఇవ్వడం సాధ్యం కాదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి... మాట్లాడటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం
Satyavathi Rathod: బయ్యారం ఫ్యాక్టరీ తెలంగాణ హక్కు.. కిషన్ రెడ్డిపై మంత్రి సత్యవతి ఫైర్..
Satyavathi Rathod: బయ్యారం ఉక్కు - తెలంగాణ హక్కు అని, ఈ ఫ్యాక్టరీ ఇవ్వడం సాధ్యం కాదని కిషన్ రెడ్డి మాట్లాడటాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. TRSLP కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కోసం ప్రధానికి ముఖ‌్యమంత్రి కేసీఆర్ అనేకసార్లు లేఖలు రాశారని చెప్పారామె ఈ ఫ్యాక్టరీ కోసం ఇక్కడి తామంతా యువతతో కలిసి పోరాడామని, దీంతో ఇస్తామని మాట దాట వేశారని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవగాహన లేక అబద్దాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. గిరిజనులకు అన్యాయం జరిగేలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని ఆమె హెచ్చరించారు.
hmtv బతుకమ్మ పాట 2022 కోసం ఇక్కడ క్లిక్ చేయండి