ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మహార్ధశ.. మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఆధునీకరణ

Prashanth Reddy: ఆ పల్లె ఆసుపత్రులకు కార్పొరేట్ హంగులు సమకూరాయి.

Update: 2021-12-16 06:26 GMT

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మహార్ధశ.. మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఆధునీకరణ

Prashanth Reddy: ఆ పల్లె ఆసుపత్రులకు కార్పొరేట్ హంగులు సమకూరాయి. నిన్నటి వరకు కనీస వసతులకు నోచుకోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఇప్పుడు ఆక్సిజన్ పడకలు అందుబాటులోకి వచ్చాయి. మాతాశిశు సంరక్షణతో పాటు కోవిడ్ రోగులకు అత్యవసర చికిత్సకు అవసరమయ్యే విధంగా ఆధునీకరించారు.

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మహార్ధశ పట్టుకుంది. మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఆయన మిత్రులు పల్లె దవాఖానాల ఆధునీకరణకు ముందుకొచ్చారు. మౌలిక వసతుల కల్పనకు 1.75 కోట్ల నిధులు విరాళంగా అందించారు. ఫలితంగా నియోజకవర్గంలోని 12 ఆసుపత్రులను కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా తీర్చిదిద్దారు. గతంలో అత్యవసర వైద్యానికి నిజామబాద్ కు పరుగులు పెట్టాల్సి వచ్చేదని ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఆధునిక వసతులతో పేదలకు కార్పొరేట్ వైద్యం అందే అవకాశం ఏర్పడిందని గ్రామస్ధులు చెబుతున్నారు.

నిజామాబాద్ జిల్లాపై కోవిడ్ సెకెండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపింది. పల్లె దవాఖానాల్లో అత్యవసర చికిత్సకు అవసరమైన సౌకర్యాలు లేక బాధితులు వైద్యం కోసం నిజామాబాద్, హైదరాబాద్ కు పరుగులు పెట్టారు. ఈ పరిస్థితి మళ్లీ తలెత్తకుండా గ్రామీణ వైద్యాన్ని బాగు చేయాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని తన స్నేహితుల సహకారంతో మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. పెరిగిన వసతులతో మెరుగైన వైద్యం అందిస్తామని వైద్యులు చెబుతున్నారు.

మంత్రి ప్రశాంత్ రెడ్డి చూపిన చొరవతో నియోజకవర్గంలోని ఆసుపత్రులు ఆధునిక హంగులతో కార్పొరేట్ ఆసుపత్రుల తరహాలో మారాయి. అన్ని నియోజకవర్గాల్లో ఈ తరహా మౌలిక వసతులు అందుబాటులోకి వస్తే ధర్ట్ వేవ్ వచ్చినా పల్లె ప్రజలకు బెంగ లేకుండా మెరుగైన వైద్యం అందనుంది.

Full View


Tags:    

Similar News