KTR: నేడు మహబూబ్‌నగర్‌ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

KTR: జడ్చర్లలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ప్రారంభించనున్న మంత్రి

Update: 2023-06-08 03:15 GMT

 KTR: నేడు మహబూబ్‌నగర్‌ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

KTR: ఇవాళ మహబూబ్‌నగర్‌లో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. పర్యటనలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌కు భూమిపూజ చేయనున్నారు. కేటీఆర్‌ పర్యటన నేపథ్యంలో మెట్టుగడ్డ- పిల్లలమర్రి రోడ్డులో ఉన్న ఐటీఐ బాలికల కళాశాల వద్ద కలెక్టర్‌, ఎస్పీ, ఇతర అధికారులతో కలిసి మంత్రి శ్రీనివాస్‌‌గౌడ్ ఏర్పాట్లను పరిశీలించారు. సెయింట్‌ ఫౌండేషన్‌, శాంతానారాయణగౌడ్‌ చారిటుబల్‌ ట్రస్ట్‌ సంయుక్తంగా ఐటీఐ కళాశాలలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నాయి.

ఈ సందర్భంగా ఫౌండేషన్ల ఆధ్వర్యంలో వంద రోజుల పాటు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు ప్రదానం చేయడంతో పాటు సెంటర్‌ నిర్మాణానికి కేటీఆర్‌ భూమిపూజ చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు మూసాపేట మండలం వేములలో కోజెంట్ పరిశ్రమ నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. ఆ తర్వాత పద్మావతి కాలనీ అయ్యప్ప గుట్ట సమీపంలో నిర్మించిన ఆధునిక వైకుంఠ ధామాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని, తర్వాత మధ్యాహ్నం 1.45 గంటలకు జడ్చర్లలో డబుల్‌ బెడ్రూం ఇండ్లకు ప్రారంభోత్సవం చేయనున్నారు.

Tags:    

Similar News