Minister KTR: ఏపీ పరిస్థితులపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Minister KTR: ఏపీలో రహదారుల పరిస్థితి మరీ అధ్వాన్నం
ఏపీ పరిస్థితులపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Minister KTR: ఏపీ పరిస్థితులపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ హైటెక్స్‌లో జరుగుతున్న క్రెడాయ్ ప్రాపర్టీ షోలో పాల్గొన్న కేటీఆర్.. తెలంగాణలో మౌలిక సదుపాయాల కల్పన బాగుందన్నారు. ఇక ఏపీలో రహదారుల పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉన్నాయని తెలిపారు. ఏపీ వెళ్లివచ్చిన తన స్నేహితులే ఈ విషయం చెబుతున్నారని తెలిపారు. అక్కడ రహదారులు, నీళ్లు, కరెంట్ పరిస్థితి ఘోరంగా ఉందని, తెలంగాణలో రోడ్లు, మౌలిక సదుపాయాలు బాగున్నాయన్నారు. అనుమానం ఉంటే ఎవరైనా రాష్ట్రంలో పర్యటించండన్నారు.