Minister KTR: రాజగోపాల్‌రెడ్డి అట్టర్ ఫ్లాప్ ఎమ్మెల్యే
Minister KTR: కాంట్రాక్టుల కోసం నియోజకవర్గాన్ని.. నిర్లక్ష్యం చేసిన వ్యక్తి రాజగోపాల్
Minister KTR: రాజగోపాల్‌రెడ్డి అట్టర్ ఫ్లాప్ ఎమ్మెల్యే
Minister KTR: మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్ ఫైరయ్యారు. రాజగోపాల్‌రెడ్డి ఓ అట్లర్ ఫ్లాప్ ఎమ్మెల్యే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి అహంకారానికి మధ్య జరుగుతున్న ఉప ఎన్నిక అన్నారు. అక్రమ కాంట్రాక్టులతో రాజగోపాల్‌రెడ్డి సంపాధించిన ధన బలానికి, మునుగోడు ప్రజల జనబలానికి పోటీ జరగబోతోందన్నారు. కాంట్రాక్టుల కోసం రాజగోపాల్‌రెడ్డి నియోజకవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మరోసారి హామీలు, ప్రలోభాలతో ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యాడని విమర్శించారు. బీజేపీకి, రాజగోపాల్ రెడ్డికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు మునుగోడు ఓటర్లు సిద్ధంగా ఉన్నారన్న కేటీఆర్ కేవలం ఒక వ్యక్తి ధనదాహం వల్ల వచ్చిన ఎన్నిక అంటూ మండిపడ్డారు.