Minister KTR: ఏం మొహం పెట్టుకుని మోడీ వరంగల్‌కు వస్తున్నారు.. బహిరంగ సభను మేం బహిష్కరిస్తున్నాం

Minister KTR: రాష్ట్రం పట్ల మోడీ నరనరాన విషం నింపుకొన్నారు

Update: 2023-07-07 07:43 GMT

Minister KTR: ఏం మొహం పెట్టుకుని మోడీ వరంగల్‌కు వస్తున్నారు.. బహిరంగ సభను మేం బహిష్కరిస్తున్నాం

Minister KTR: నరేంద్ర మోడీ ప్రధానిగా ఎన్నికయిన తర్వాత మొదటి నుంచీ తెలంగాణ పుట్టుకను అవమానించిన వ్యక్తి అని, తెలంగాణ రాష్ట్రం పట్ల నరనరాన విషం నింపుకొన్నారని రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. విభజన చట్టంలోని ఒక్క హామీని అమలు చేయకపోగా.. ఏం మొహం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నారో తమకు తెలియదన్నారాయన.. గుజరాత్‌లోని దాహోద్‌లో 20 వేల కోట్లతో లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. మన ఖాజీపేటకేమో కేవలం 521 కోట్లతో కేవలం రిపేర్ షాపులాంటి వ్యాగన్ ఫ్యాక్టరీని ఇస్తున్నారని ఆరోపించారు. మన తెలంగాణకు ముష్టి వేస్తున్నారా.. ప్రధాని మోడీ అంటూ ప్రశ్నించారాయన..

వరంగల్‌లో ట్రైబల్ యూనివర్సిటీ మంజూరు చేయలేదని, బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్ట లేదని ఆరోపించారు. సమాజంలో మతం పేరుతో మోడీ చిచ్చు పెడుతున్నారని దుయ్యబట్టారు. గిరిజనులను, అక్కడి ప్రజలను మోసం చేసిన మోడీ.. తూతూ మంత్రంగా నిధులు ఇచ్చి.. చేతులు దుపుకొంటామంటే ఇక్కడి ప్రజలు అమాయకులు కాదన్నారు. ఈ నేపథ‌్యంలో రేపటి వరంగల్ బహిరంగ సభను బహిష్కరిస్తామని నిర్ణయించామని మంత్రి తెలిపారు. 

Tags:    

Similar News