సంతోష్ బాబు జ్ఞాపక చిహ్నంగా కేసారం : మంత్రి జగదీశ్

Update: 2020-06-18 08:41 GMT

భారత్‌ -చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్‌ సంతోష్‌బాబు అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో నిర్వహించారు. సూర్యాపేట సమీపంలోని కేసారంలో ఉన్న సంతోష్‌బాబుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో అంతిమ సంస్కారాలు జరిగాయి. కల్నల్ సంతోష్‌బాబుకు మంత్రి జగదీష్‌రెడ్డి అశ్రునయనాలతో కడసారి వీడ్కోలు పలికారు. సంతోష్ బాబు అంత్యక్రియలను మంత్రి జగదీష్ ప్రభుత్వ ప్రతినిధిగా దగ్గరుండి జరిపించారు.

దహన సంస్కారాల ముగిసిన అనంతరం మంత్రి జగదీష్‌ రెడ్డి మాట్లాడుతూ.. సంతోష్‌బాబు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు సందేశం పంపారు. వారి పిల్లల చదువులు, కుటుంబ సభ్యులకు ప్రభుత్వం బాసటగా ఉంటుందని పేర్కొన్నారు. కల్నల్ సంతోష్ బాబు జ్ఞాపక చిహ్నంగా కేసారాన్ని మారుస్తామన్నారు. అలాగే సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రధాన కూడలికి సంతోష్ బాబు పేరు పేరు పెడుతామని మంత్రి జగదీశ్‌ వెల్లడించారు.

Tags:    

Similar News