Harish Rao: ఇవాళ మహారాష్ట్ర పర్యటనకు మంత్రి హరీష్ రావు
Harish Rao: హరీష్ రావు నేతృత్వంలో షోలాపూర్ వెళ్లనున్న బీఆర్ఎస్ నేతలు
Harish Rao: ఇవాళ మహారాష్ట్ర పర్యటనకు మంత్రి హరీష్ రావు
Harish Rao: ఇవాళ మహారాష్ట్ర పర్యటనకు మంత్రి హరీష్ రావు వెళ్లనున్నారు. షోలాపూర్‌లో నిర్వహించనున్న మార్కండేయ రథోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్నారు. తెలంగాణ నుంచి వెళ్లి షోలాపూర్‌లో స్థిరపడిన పద్మశాలీలు.. తమ ఆరాధ్య దైవం మార్కండేయ రథోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులు హాజరుకావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో ఇవాళ హరీష్ రావుతో పాటు హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ రమణ, మహారాష్ట్ర బిఆర్ఎస్ ఇంచార్జ్ కల్వకుంట్ల వంశీధర్ రావుతో పాటు పలువురు నేతలు వెళ్లనున్నట్లు సమాచారం. రథోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం షోలాపూర్‌లో త్వరలో నిర్వహించే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు స్థలాన్ని పరిశీలించనున్నారు మంత్రి హరీష్ రావు.