కిషన్ రెడ్డికి మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ

*ఉపాధి హామీ పథకం రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు విమర్శించారు

Update: 2022-08-03 05:12 GMT

కిషన్ రెడ్డికి మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ

Harish Rao: ఉపాధి హామీ పథకం రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు విమర్శించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకంపై కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయడం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి చూస్తే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా ఉందని లేఖలో తెలిపారు. కేంద్రం ఉపాధి హామీ కూలీల హక్కులను కాలరాస్తున్నారని మంత్రి హరీష్‌రావు ఆరోపించారు.

కేంద్రం విధించిన నిబంధనలు తెలంగాణ ప్రజలను ఇబ్బందులకు గురి చేసేలా ఉన్నాయని తెలిపారు. కేంద్రం ఉపాధి హామీ నిధులను తగ్గించిందన్నారు. ఎర్రటి ఎండలో 8 గంటలు పని చేయడం సాధ్యమయ్యే పనేనా అని ప్రశ్నించారు మంత్రి హరీష్‌ర్‌రావు. సరికొత్త నిబంధనలతో ఉపాధి కూలీలను ఇబ్బంది పెట్టడం తప్ప సాధించేది ఏమీ లేదని కిషన్‌రెడ్డికి రాసిన లేఖలో వివరించారు మంత్రి హరీష్‌రావు.

Tags:    

Similar News