Errabelli Dayakar Rao: తెలంగాణ కంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు బాగుంటే రాజీనామా చేస్తా
Errabelli Dayakar Rao: బీజేపీ నాయకులకు మంత్రి ఎర్రబెల్లి సవాల్
Errabelli Dayakar Rao: తెలంగాణ కంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు బాగుంటే రాజీనామా చేస్తా
Errabelli Dayakar Rao: తెలంగాణ రాష్ట్రం కంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు బాగుంటే తాను రాజీనామా చేయడానికైనా సిద్ధమేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్ విసిరారు. బీజేపీ పాలించే రాష్ట్రాలకు వెళ్లి చూద్దామంటే ఆ పార్టీ నాయకులు ముందుకు రావడం లేదన్నారు. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ సభ చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. తన రాజకీయ జీవితంలో ఇంత పెద్ద సభను ఎప్పుడూ చూడలేదన్నారు. సభను చూసిన తర్వాత అయినా ప్రతిపక్షాలకు కనువిప్పు కలగాలన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ మొదటి స్థానంలో నిలిపిన కేసీఆర్... దేశాన్ని కూడా అదే తీరులో నిలబెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. బండి సంజయ్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిచ్చిపిచ్చిగా మాట్లాడటం మానుకోవాలని హెచ్చరించారు.