Lockdown: తెలంగాణలో లాక్‌డౌన్‌ పెట్టే ఆలోచన లేదు -మంత్రి ఈటల

Lockdown: ఏడాది నుంచి కరోనాతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం -ఈటల

Update: 2021-04-29 10:59 GMT

ఈటెల రాజేందర్ (ఫైల్ ఇమేజ్)

Lockdown: తెలంగాణలో ప్రస్తుతం లాక్‌డౌన్‌ పెట్టే ఆలోచన లేదని మరోసారి స్పష్టం చేశారు మంత్రి ఈటల రాజేందర్‌. ఏడాది నుంచి కరోనాతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న ఆయన.. కేంద్రం ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తోందన్నారు. వ్యాక్సిన్లు, ఇంజక్షన్నింటినీ కేంద్రం తన చేతుల్లో పెట్టుకుందని, కేంద్రం చేసిన తప్పులకు రాష్ట్రాలను నిందించడం కరెక్ట కాదన్నారు. వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రం మరోసారి పునరాలోచించుకోవాలని అన్నారు మంత్రి ఈటల.

Tags:    

Similar News