Coronavirus Effect: కిలో చికెన్ @ రూ.25

కరోనా దెబ్బకు రాష్ట్రంలో చికెన్ వ్యాపారులకు తీరని నష్టం వాటిల్లుతుంది. చికెన్ తింటే ఎక్కడ తమకు కరోనా వ్యాపిస్తుందో అని చికెన్ ప్రియులు చికెన్ తినడం మానేసారు.

Update: 2020-03-09 13:13 GMT

కరోనా దెబ్బకు రాష్ట్రంలో చికెన్ వ్యాపారులకు తీరని నష్టం వాటిల్లుతుంది. చికెన్ తింటే ఎక్కడ తమకు కరోనా వ్యాపిస్తుందో అని చికెన్ ప్రియులు చికెన్ తినడం మానేసారు. దీంతో రాష్ట్రంలో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. అప్పటినుంచి చికెన్ షాపులకు, పౌల్ట్రీ పరిశ్రమకు తీవ్రంగా నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరంలో మొన్నచికెన్, ఎగ్ మేళాను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో స్వయాన కేటీఆర్ పాల్గొని చికెన్ తింటే ఎలాంటి అపాయం జరగదని చెప్పారు. దాంతో పాటుగానే ప్రభుత్వం కూడా కరోనా వైరస్ వల్ల ఎలాంటి ప్రమాదం ఉండబోదని అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించారు. అయినప్పటికీ చాలా మంది ప్రజలకు నమ్మకం కలగక పోవడంతో చికెన్ తినడం మానేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే చికెన్ షాపుల యజమానులు, పౌల్ట్రీ యజమానులు చికెన్ పైన కొన్ని ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఓ చికెన్ షాపు యజమాని 70 రూపాయలకు కిలో చికెన్ ను ఆఫర్ చేయగా. మరో షాపు యజమాని కిలో చికెన్ కొంటే 4 గుడ్లు ఉచితం అని బోర్డులు తలిగించారు. ఇదే కోణంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఓ చికెన్ షాపు యజమాని వినూత్న రీతిలో ప్రచారం చేశాడు.

నాలుగు కిలోల బరువు తూగే రెండు కోళ్లు కేవలం రూ.100 కే అమ్మాడు. కోళ్లకు కరోనా వైరస్ ఉండదని, వాటిని తింటే ఎలాంటి అపాయం జరగదని చాటి చెప్పేందకే ఈ తరహా అమ్మకాలు చేపట్టినట్టు షాపు యజమాని తెలిపాడు. దీంతో వినియోగదారులు ఈ ఆఫర్ ఏదో బానే ఉందే. ఈ లెక్కన చూసుకుంటే కిలో చికెన్ కేవలం 25రూపాయలకు వస్తుందని షాపు ముందు క్యూ కట్టారు. ఇక పోతే ఈ కరోనా వైరస్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ఇప్పటి వరకూ రూ.2 వేల కోట్ల నష్టం వాటిల్లినట్టు వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే.


Tags:    

Similar News