ఇవాళ జలసౌధలో మేడిగడ్డ బ్యారేజీపై సమావేశం
Medigadda Barrage: ఇరిగేషన్, సెక్రటరీ, ఈఎన్సీ అధికారులతో నిపుణుల భేటీ
ఇవాళ జలసౌధలో మేడిగడ్డ బ్యారేజీపై సమావేశం
Medigadda Barrage: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నిపుణుల బృందం బుధవారం పరిశీలించింది. CWPRS పూణేకు చెందిన జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ నిపుణుల బృందం అణువుణువునా పరిశీలన చేసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఏడో బ్లాక్ ప్రాంతంలో బ్యారేజీ వంతెనపై కాలినడకన సాగుతూ పరిశీలించారు. బ్యారేజీ ఎగువ, దిగువ ప్రాంతాల్లో తిరుగుతూ అణువుణువునా పరీక్షించారు. కాగా ఇవాళ జలసౌధలో ఇరిగేషన్ సెక్రెటరీ, ఈఎన్సీ అధికారులతో పూణేకు చెందిన నిపుణుల బృందం సమావేశం కానుంది.