Medico Preethi: ప్రీతి కేసు నిందితుడు సైఫ్‌ను ఏడాదిపాటు సస్పెండ్ చేసిన కేఎంసీ
Medico Preethi: మెడికో ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడు సైఫ్‌ను కేఎంసీ ప్రిన్సిపాల్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Medico Preethi: ప్రీతి కేసు నిందితుడు సైఫ్‌ను ఏడాదిపాటు సస్పెండ్ చేసిన కేఎంసీ
Medico Preethi: మెడికో ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడు సైఫ్‌ను కేఎంసీ ప్రిన్సిపాల్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాది పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అనస్థీషియాలజీలో పీజీ సెకండియర్ చదువుతున్న సైఫ్‌ను.. అకాడమిక్‌తో పాటు అన్ని క్లాసులకు అనుమతి లేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. యాంటీ ర్యాగింగ్ కమిటీ సిఫార్సుల మేరకు సైఫ్‌ను కేఎంసీ సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. సైఫ్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపగా బెయిల్‌పై బయటకొచ్చిన సంగతి తెలిసిందే.