రైల్వే సిబ్బందికి శుభవార్త : వాట్సాప్‌ చేస్తే మందులు ఇంటికే

రైల్వే ఉద్యోగులకు, పెన్షనర్లకు లాక్ డౌన్ సమయంలో దక్షిణమధ్య రైల్వే శుభవార్తను తెలిపింది.

Update: 2020-04-30 06:35 GMT
Representational Image

రైల్వే ఉద్యోగులకు, పెన్షనర్లకు లాక్ డౌన్ సమయంలో దక్షిణమధ్య రైల్వే శుభవార్తను తెలిపింది. లాక్ డౌన్ జరుగుతున్న నేపథ్యంలోనే ఉద్యోగులు మందులకోసం బయటికి వెళ్లకుండా డోర్‌డెలివరీ చేసేందుకు సిద్ధమైంది. అందుకోసం అందుబాటులోకి ప్రత్యేకంగా వాట్సాప్‌ నంబర్లను ఏర్పాటు చేసారు. ఈ సౌకర్యం ప్రస్తుతం రైల్వేశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు, రిటైర్ ఉద్యోగులు, పెన్షనర్లకు ఉపయోగపడనుంది.

అత్యవసరంగా మందులు కావాలనుకే వారు వారి పేరు లేదా పేషంటు, పెన్షనర్‌ పేరు, ఆధార్‌కార్డు , మెడికల్‌ ఐడీ కార్డు, గత నెల డాక్టర్‌ ప్రిస్కిప్షన్‌, అడ్రస్‌ విత్‌ ల్యాండ్‌మార్క్‌ వివరాలు వాట్సాప్‌ మెంబర్‌కు మెసేజ్‌ చేయాలి. సమాచారం అందగానే రైల్వేశాఖ లాలాగూడలోని సెంట్రల్‌ హాస్పిటల్‌ ద్వారా కావాల్సిన మందులను ఇచ్చిన చిరునామాకు పంపిస్తారని దక్షిణమధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి సమన్వయ కర్తాగా లాలాగూడ చీఫ్‌ సర్జన్‌ డాక్టర్‌ రమేష్‌ను నియమించినట్లు తెలిపారు. ఇక మందులు ఆర్డర్ పెట్టుకునేందుకు ఇచ్చిన వాట్సాప్‌ నంబర్లు 9701370555, 9618936328.


Tags:    

Similar News