Medaram Jatara: మేడారం మహాజాతర తేదీలు ఖరారు

Medaram Jatara: 2022 ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జాతర

Update: 2021-04-25 10:45 GMT

మేడారం జాతర ఫైల్ ఫోటో 

Medaram Jatara: ఆసియాఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరు గాంచిన మేడారం మహాజాతర తేదీలు ఖరారు అయ్యాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర నిర్వహించనున్నారు. తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో ఆదివాసీ గిరిజన సాంప్రదాయ ప్రకారం మాఘ శుద్ధ పౌర్ణమి రోజున జాతర నిర్వహిస్తారు. కోట్ల సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. ఫిబ్రవరి 16న సారమ్మల, గోవిందరాజు, పగిడిద్ద రాజు గద్దెలకు చేరుకోనున్నారు. ఫిబ్రవరి 17న సమ్మక్క గద్దెకు రానున్నది. ఫిబ్రవరి 18న భక్తులు మొక్కులు సమర్పించుకోనున్నారు. ఫిబ్రవరి 19న వనదేవతల వనప్రవేశం ఉంటుందని, గోవిందరాజు, పగిడిద్దరాజులు వారి వారి స్వగ్రామాలకు వెళ్లడంతో మహాజాతర ముగుస్తుందని ఆలయల పూజారులు తెలిపారు.  

Tags:    

Similar News