Mulugu Encounter: ములుగు జిల్లాలో భారీ ఎన్ కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు హతం
Mulugu Encounter: తెలంగాణలోని ములుగు జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.
ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ (ఫైల్ ఫొటో)
Mulugu Encounter: తెలంగాణలోని ములుగు జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఏటూరు నాగారంలోకి చల్పాక అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు హతయ్యారు. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో వీరు మరణించినట్లు సమాచారం. తెలంగాణ గ్రేహౌండ్స్, యాంటీ మావోయిస్టు స్క్వాడ్ సంయుక్తం ఈ ఆపరేషన్ నిర్వహించాయి. ఎన్ కౌంటర్ పై పోలీసులు ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. మరణించినవారిలో మావోయిస్టు కీలక నేతలు ఉన్నట్లు సమాచారం. ఇల్లెందు నర్సింపేట ఏరియా కమిటీ కార్యదర్శి బద్రు అలియాస్ పాపన్న ఉన్నట్లు తెలుస్తోంది.
వారి రోజుల క్రితం ఇద్దరు ఆదివాసీలను ఇన్ఫర్మార్స్ అనే నేపంతో మావోయిస్టులు చంపారు. వారం తిరగకముందే ఏడుగురు మావోయిస్టులు ఎన్ కౌంటర్ లో మరణించారు. ఆదివాసీల హత్య తర్వాత అటవీ ప్రాంతంలో పోలీసులు భారీ కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలోనే చల్పాక అటవీ సమీపంలో జవాన్లకు, మావోలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 7గురు మావోలు మరణించారు.
కాగా గత నెల 22న ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్ 10 మంది మావోయిస్టులు మరణించారు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్ లో భాగంగా కుంటా పోలీస్ స్టేషన్ పరిధిలోని డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, మావోయిస్టులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. దీంతో 10 మంది మావోయిస్టులు మరణించారు. ఎన్ కౌంటర్ ప్రాంతం నుంచి ఆటోమెటిక్ తొపాకులతోపాటు పలు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.