యాదాద్రిలో భక్తుల రద్దీ.. స్వామి వారి దర్శానానికి రెండు గంటల సమయం

కార్తీక మాసం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు.

Update: 2025-11-03 06:33 GMT

కార్తీక మాసం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని వివిద ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి... శివాలయం, కార్తీక దీపారాధన, వ్రత మండపాలతో పాటు కొండపై ఎక్కడ చూసినా భక్తుల సందడే కనిపించింది. కల్యాణకట్ట, పార్కింగ్ ఏరియా, బస్ బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు రద్దీగా మారాయి. స్వామివారి దర్శనానికి రెండు గంటలకు పైగా పడుతుంది. స్పెషల్ దర్శనానికి గంటకు పైగా సమయం పడుతోంది.

యాదగిరిగుట్టలో కార్తీకశోభ సంతరించుకుంది. భక్తులు కార్తీక దీపాలు వెలిగించుకోవడానికి కొండపైన ప్రధానాలయ ప్రాంగణం, శివాలయం, కొండ కింద వ్రత మండపం. వైకుంఠ ద్వారం చెంత, లక్ష్మీపుష్కరిణి వద్ద దీపారాధన స్టాళ్లు ఏర్పాటు చేశారు. భక్తులు కుటుంబ సమేతంగా కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు.

Tags:    

Similar News