Chinese Manja: హైదరాబాద్‌లో భారీగా చైనా మాంజా పట్టివేత

Chinese Manja: సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్‌లో భారీగా నిషేధిత చైనా మాంజాను పోలీసులు, అటవీశాఖ అధికారులు సీజ్ చేశారు.

Update: 2026-01-08 06:49 GMT

Chinese Manja: హైదరాబాద్‌లో భారీగా చైనా మాంజా పట్టివేత

Chinese Manja: సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్‌లో భారీగా నిషేధిత చైనా మాంజాను పోలీసులు, అటవీశాఖ అధికారులు సీజ్ చేశారు. పక్షులతో పాటు మనుషుల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ నైలాన్ మాంజాను విక్రయిస్తున్న ముఠాల గుట్టురట్టు చేశారు.

తనిఖీల్లో భాగంగా దాదాపు రూ.1.2 కోట్ల విలువైన నిషేధిత చైనా మాంజాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దిల్లీ, సూరత్, మహారాష్ట్ర వంటి ప్రాంతాల నుంచి స్థానిక దుకాణాదారులు రహస్యంగా ఈ మాంజాను తెప్పిస్తున్నట్లు గుర్తించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చైనా మాంజాపై పూర్తిస్థాయి నిషేధం ఉన్నప్పటికీ, కొందరు వ్యాపారులు అధిక లాభాల కోసం దీనిని మార్కెట్లోకి తెస్తున్నారు.

పతంగులు ఎగురవేసే క్రమంలో ఈ గట్టి మాంజా విద్యుత్ తీగలకు, చెట్లకు వేలాడుతూ ప్రయాణికుల మెడకు చుట్టుకుంటోంది. దీనివల్ల వాహనదారులు తీవ్ర గాయాలపాలు కావడమే కాకుండా ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి.

Tags:    

Similar News