Man Cheated Young Woman: రెండు పెళ్లిళ్లు చేసుకున్న ప్రభుద్దుడు.. చివరికి ఏమైందంటే...

Man Cheated Young Woman: ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి ఎక్కడో ఒక చోట వింటూనే ఉంటాం.

Update: 2020-07-19 12:45 GMT
Man Cheated Young Woman

Man Cheated Young Woman: ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి ఎక్కడో ఒక చోట వింటూనే ఉంటాం. అంతే కాక బాగా చదువుకుని ఒక స్థాయిలో ఉండాలి అనుకుని గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చిన ఆడపిల్లలను మాయమాటలు చెప్పి కొంత మంది మోసం చేసిన సంఘటనలను కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇదే తరహాలో మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. బాగా చదువుకుని మంచి స్థాయికి రావాలని ఓ యువతి హైదరాబాద్ నగరానికి వచ్చింది. కానీ ఓ యువకుడు మాత్రం ఆమెకు మాయమాటలు చెప్పి తనకి పెళ్ళికాలేదని నమ్మించి ఆమెను పెళ్లి చేసుకుని గర్భవతిని చేసాడు. ఆ తరువాత ఆ అమ్మాయికి చెప్పకుండా వదిలి పారిపోయాడు. దీంతో ఆమె ఇరుగు పొరుగువారి సహాయంతో ఆస్పత్రిలో చేరి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తనకు తాళి కట్టినవాడు ఎప్పుడొస్తాడా ఎని ఎదురు చూస్తోంది.

ఈ సంఘటన గురించి మహాంకాళి పోలీసులు, బాధితురాలు తెప్పిన పూర్తివివరాల్లోకెళితే గుంటూరుకు చెందిన ఎస్ కే షబీనా (25) కొన్నేళ్ళ క్రితం పెద్ద చదువులు చదువుకోవడానికి హైదరాబాద్ నగరానికి వచ్చి ఈసీఐఎల్ ఏరియాలో నివాసం ఏర్పచుకుంది. అదే సమయంలో అవుసరి సంపత్(29) అనే వ్యక్తి షబీనాకు ఒక స్నేహితురాలి ద్వారా పరిచయం అయ్యాడు. కాగా వారిద్దరి పరిచయం కాస్త ముదిరి కొన్నాళ్లకు ప్రేమగా మారింది. ఆ తరువాత సంపత్ తనకు పెళ్లి కాలేదని ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుంటానని ఆమెతో చెప్పాడు. అతని మాయ మాటలు నమ్మిన షబీనా సంతోష్ ని 2018 , మార్చి 14 న వివాహం చేసుకుంది. కానీ సంతోష్ కు అప్పటికే పెళ్లై భార్య ఓ కూతురు కూడా ఉన్నారు. వారు వనస్ధలిపురంలో ఉంటున్నారు. అయితే రెండో పెళ్లి చేసుకున్న తరువాత సంపత్, షబీనాలు ఆవుల మందలో ఇల్లు తీసుకుని అక్కడ కాపురం పెట్టారు.

ఇక రెండు పెళ్లిళ్లు చేసకున్న సంతోష్ అటు పెద్ద భార్యకు, ఇటు చిన్న భార్యకు అనుమానం రాకుండా ఇద్దరిని హ్యండిల్ చేసాడు. తనకు నైట్ డ్యూటీలు ఉన్నాయని చెప్పి సంపత్ రాత్రిపూట మొదటి భార్య దగ్గరకు వెల్లి వస్తూ ఉండేవాడు. అయితే అప్పటికే షబీనా గర్భవతి కూడా కాగా సంపత్ తన రెండో భార్య షబీనాను మే 31న ఈసీఐఎల్ లో ఉండే స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. అక్కడ తన స్నేషితునికి జరిగిన విషయం అంతా వివరించి చెప్పాడు. అది విన్న సంపత్ స్నేహితుడు అతని మొదటి భార్యకు సమాచారం చేరవేశాడు. అది విన్న సంపత్ మొదటి భార్య తన సోదరుడితో జూన్ 4న సంపత్ రెండో భార్య ఇంటికి వచ్చి గొడవ పడింది. దీంతో చేసేదేమి లేక సంపత్ మొదటి భార్య వెంట వెళ్లి పోయాడు. అప్పటికే గర్భంతో ఉన్న షబీనా బాలా నగర్ లో చిన్న గదిలో ఒంటరిగా జీవిస్తోంది. నెలలు నిండటంతో ఇంటి దగ్గర ఉన్న ఒక మహిళ సహాయంతో కోఠి మెటర్నటీ ఆస్పత్రిలో చేరి జులై9న బాబుకు జన్మనిచ్చింది. ఇక భర్త ఆమెను వదిలి వెళ్లిన దగ్గరి నుంచి షబీనా దగ్గరకు రావటం కానీ ఫోన్ చేయటం కానీ చేయలేదు. దీంతో ఆమె మహంకాళి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంపత్ కోసం గాలిస్తున్నారు.


Tags:    

Similar News