Marri Shashidhar Reddy: ఇవాళ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న మర్రి శశిధర్ రెడ్డి
Marri Shashidhar Reddy: సాయంత్రం 4గంటలకు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిక
Marri Shashidhar Reddy: ఇవాళ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న మర్రి శశిధర్ రెడ్డి
Marri Shashidhar Reddy: మాజీ మంత్రి, సనత్‌నగర్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి ఇవాళ కమలం గూటికి చేరనున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో సాయంత్రం 4గంటలకు కాషాయ తీర్ధం పుచ్చుకోనున్నారు. బీజేపీలో చేరిక సందర్భంగా నిన్న మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఆయన పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్, డీకే అరుణ, ఇతర రాష్ట్ర ముఖ్య నేతలు ఢిల్లీకి చేరుకున్నారు.