Maoist Sharadakka: మావోయిస్టు నేత సమ్మక్క అలియాస్ శారదక్క లొంగుబాటు

Maoist Sharadakka: *అనారోగ్యం కారణంగా గత కొంత కాలంగా పార్టీకి దూరం *డీజీపీ ముందు శారదక్క లొంగుబాటు

Update: 2021-09-17 07:32 GMT

మావోయిస్టు నేత సమ్మక్క అలియాస్ శారదక్క లొంగుబాటు

Maoist Sharadakka: మావోయిస్టుల నేత సమ్మక్క అలియాస్ శారదక్క పోలీసుల ఎదుట లొంగిపోయారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బజ్జర సమ్మక్క అలియాస్ శారదక్క డీజీపీ మహేందర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు.. మహబూబాద్ జిల్లాలోని గంగారానికి చెందిన శారదక్క పీపుల్స్‌వార్ పార్టీకి ఆకర్షితులైన 1994 అజ్ఞాతంలోకి వెళ్లారు.. ప్రస్తుతం జిల్లా కమిటీ సభ్యురాలిగా పని చేస్తున్నారు. గతంలో చర్ల-శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేశారు.

శారదక్క భర్త మావోయిస్టు కీలక నేత హరిభూషణ్. ఈ ఏడాది జూన్ 21న అనారోగ్యంతో చనిపోయారు. అప్పటి నుంచి శారదక్క పార్టీకి, పార్టీ కార్యకాలాపాలకు దూరంగా ఉంటున్నారు.

Tags:    

Similar News