Manjeera Floods: నిజామాబాద్‌లో దంచికొడుతున్న వర్షాలు మంజీరా ఉగ్ర రూపం
బోధన్, సాలూరాలో వరద పోటు సాలూర మండలంలోని పలు గ్రామాలు జలదిగ్బంధం 15వేల ఎకరాల్లో నీటమునిగిన సోయా, అరటి పంటలు పెట్టిన పెట్టుబడి కన్నీళ్లు మిగిల్చిందంటున్న రైతన్నలు.
Manjeera Floods: నిజామాబాద్‌లో దంచికొడుతున్న వర్షాలు మంజీరా ఉగ్ర రూపం
భారీ వర్షాలకు మంజీర ఉగ్ర రూపం దాల్చింది. నిజాంసాగర్ నుంచి వస్తున్న వరదతో నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. మరోవైపు మహారాష్ట్ర నుంచి గోదావరికి భారీగా వరద వస్తోంది. దీంతో ఈ రెండు నదులు కలిసే నిజామాబాద్ జిల్లాలోని సాలూరు మండలంతో పాటు
ఖాజాపూర్, మందర్న గ్రామాల్లో 15వేల ఎకరాల్లో సోయా, అరటి పంటలు పూర్తిగా నీట మునిగిపోయాయి. అప్పులు చేసి పంటలకు పెట్టుబడి పెట్టిన రైతులకు వరద కన్నీళ్లు మిగిలించింది. మూడుసార్లు వరద పోటెత్తడంతో చేతికి వచ్చిన పంటలు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
కాందకుర్తి వద్ద భారీగా శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ కూడా నిలిచి ఉండటంతో గ్రామాల్లోకి మంజీర వరద పారింది. దీంతో బోధన్ మండలంలోని హంగర్గ, బిక్నెల్లి, ఖండ్గావ్, కొప్పర్గ.. సాలూర మండలంలోని మందర్నా, ఖాజాపూర్, హున్స గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 40 ఏళ్ల తర్వాత ఇంతటి వరద వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు గ్రామస్థులను బస్సుల్లో పునరావాస కేంద్రాలకు తరలించారు. ఖండ్గావ్ నుంచి మహారాష్ట్రలోని కొండల్వాడికి రాకపోకలు నిలిచిపోయాయి. మంజీర ఉదృతంగా ప్రవహిస్తుండటంతో రెండు ప్రాంతాల మధ్య ఉన్న బ్రిడ్జిపై నుంచి వరద పారుతోంది.