మంచిర్యాల ట్రాఫిక్ పోలీసులు వినూత్న రీతిలో వాహనాల తనిఖీకి శ్రీకారం చుట్టారు. జిల్లా ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా వాహనాలు తనిఖీ చేస్తూ ఫైన్స్ వేయకుండా హెల్మెట్ పంచారు. అలాగే ఇన్షూరెన్స్ లేకపోతే అక్కడే ఇన్షూరెన్స్ కట్టించుకోవడం, లైసెన్స్ లేని వారికి అక్కడే స్లాట్ బుక్ చేయడం, పొల్యూషన్ సర్టిఫికేట్ అందించడం చేశారు. ఈ సందర్భంగా అన్నీ పత్రాలు కలిగి ఉన్న వాహనదారులకు ఫ్లవర్స్ అందించి అభినందించారు డీసీపీ రవి కుమార్.