Bhatti Vikramarka: అంచెలంచెలుగా ఎదిగిన భట్టి విక్రమార్క.. 2023 ఎన్నికల్లో ఘన విజయం

Bhatti Vikramarka: మల్లు అకండ, మల్లు మాణిక్యం దంపతులకు భట్టి జననం

Update: 2023-12-07 06:23 GMT

Bhatti Vikramarka: అంచెలంచెలుగా ఎదిగిన భట్టి విక్రమార్క.. 2023 ఎన్నికల్లో ఘన విజయం  

Bhatti Vikramarka: మల్లు భట్టి విక్రమార్క అంచెలంచెలుగా ఎదిగారు. మల్లు అకండ, మల్లు మాణిక్యం దంపతులకు భట్టి విక్రమార్క జన్మించారు. ఆయన స్వగ్రామం ఖమ్మం జిల్లా వైరా మండలంలోని స్నానాల లక్ష్మీపురం. హైదరాబాద్ నిజాం కాలేజీ నుండి గ్రాడ్యుయేషన్ , హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుండి పోస్టు గ్రాడ్యుయేషన్ చేశారు. 2009లో తొలిసారిగా ఎమ్మె్ల్యేగా మల్లు భట్టి విక్రమార్క ఎన్నికయ్యారు. 2009లో చీఫ్ విప్‌ అయ్యారు. అంతకుముందు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2011 జూన్ 4న ఏపీ శాసన సభ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.

2014 సాధారణ ఎన్నికల్లో మధిర నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018లో సార్వత్రిక ఎన్నికల్లో మధిర నియోజకవర్గం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బోడేపూడి వెంకటేశ్వరరావు తర్వాత మధిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించిన రెండో వ్యక్తిగా నిలిచారు. 2019 జనవరి 18న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ రెండవ అసెంబ్లీలో సీఎల్పీ నాయకుడిగా ఎంపికయ్యారు. 2023 ఎన్నికల్లో మధిర ఎమ్మెల్యేగా భట్టి విక్రమార్క ఘన విజయం సాధించారు. తాజాగా భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా సెలెక్ట్ అయ్యారు. భట్టి విక్రమార్క 1990-92లో పీసీసీ కార్యనిర్వాహక సభ్యుడిగా పని చేశారు. 2000_2003 వరకు పీసీసీ కార్యదర్శిగా పని చేశారు. 2007లో భట్టి ఎమ్మెల్సీగా పని చేశారు.

Tags:    

Similar News