నేడు హైదరాబాద్‌కు మల్లికార్జున ఖర్గే
Mallikarjun Kharge: ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా టూర్
నేడు హైదరాబాద్‌కు మల్లికార్జున ఖర్గే
Mallikarjun Kharge: AICC అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. ఎన్నికల ప్రచారం కోసం వస్తున్న ఖర్గే మధ్యాహ్నం గాంధీభవన్‌లో TPCC ప్రతినిధులతో సమావేశం కానున్నారు. తెలంగాణకు చెందిన నాయకులందరూ దాదాపుగా మల్లికార్జున ఖర్గేకే మద్దతుగా నిలుస్తుండడంతో ఈ సమావేశానికి పార్టీకి చెందిన కొందరు ముఖ్య నేతలు హాజరవుతారని గాంధీభవన్ వర్గాలు చెపుతున్నాయి.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక హస్తం పార్టీలో ఆసక్తికరంగా మారింది. దాదాపు 22 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగబోతోంది. గాంధీ కుటుంబం నుంచి ఎవరూ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు ముందుకు రాకపోవడంతో ఎన్నికల అనివార్యమైంది. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గేతో పాటు కేరళకు చెందిన తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే శశిథరూర్ అధ్యక్ష ఎన్నికలో మద్దతు కోసం హైదరాబాద్ వచ్చి వెళ్లారు. ఇక మల్లిఖార్జున కూడా ఎన్నికల్లో మద్దతు కోసం హైదరాబాద్ వస్తున్నారు.