Mallikarjun Kharge: తెలంగాణ ఎవరు ఇచ్చారు? ఎవరి కోసం ఇచ్చారు?
Mallikarjun Kharge: ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా మార్చారు
Mallikarjun Kharge: తెలంగాణ ఎవరు ఇచ్చారు? ఎవరి కోసం ఇచ్చారు?
Mallikarjun Kharge: మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. తెలంగాణ ఇవ్వగానే కేసీఆర్ సోనియా కాళ్లు మొక్కాడని, ఆ తర్వాత రోజే మాట మార్చాడని ఆయన విమర్శించారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ నిర్వహించిన బస్సు యాత్రలో పాల్గొన్న ఖర్గే.. అనంతరం కార్నర్ మీటింగ్‌లో ప్రసంగించారు. కాంగ్రెస్ పేదల పార్టీ అని, ప్రతిక్షణం నిరుగ్యోగులు, విద్యార్థులు, రైతుల పక్షాన పోరాటం చేస్తుందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటేనని ఆయన ఆరోపించారు. నిరుద్యోగుల జీవితాలతో మోడీ ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజల బతుకులు మారాలంటే రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు ఖర్గే.