Yadadri: ముస్తాబైన యాదాద్రి

Yadadri: ఇవాళ్టి నుంచి సుదర్శన యాగంనీఘా, నీడన ఆలయ పరిసరాలు.

Update: 2022-03-21 03:19 GMT

Yadadri: ముస్తాబైన యాదాద్రి

Yadadri: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా నేడు ప్రారంభం కానున్న అంకురార్పణకు ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. బాలాలయంలో పంచకుండాత్మక మహా సుదర్శన యాగం కోసం యాగశాల సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి 28 వరకు ఏడు రోజుల పాటు జరిపే పంచకుండాత్మక సుదర్శన యాగం కోసం 'వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుధ్, మహాలక్ష్మి' పేర్లు గల ఐదు కుండలాలను ఏర్పాటు చేశారు. యాగానికి 100 లీటర్ల ఆవు నెయ్యి అవసరం కాగా.. ముందస్తు జాగ్రత్తగా అదనంగా మరో 50 లీటర్లు అందుబాటులో ఉంచారు.

 మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా బాలాలయంలో ప్రారంభం కానున్న అంకురార్పణకు ఆలయం సుందరంగా ముస్తాబైంది. వారం పాటు జరగనున్న పంచకుండాత్మక మహాయాగం కోసం కుండాలు ఏర్పటయ్యాయి. గర్భాలయం, ముఖమండపం నీటితో శుద్ధి పర్వాలు నిర్వహించారు. ప్రధానాలయం చెంత విద్యుత్ దీపాల అలంకరణ చేపట్టారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవాలయం చెంత గోదావరి జల సవ్వడులు హోరెత్తనున్నాయి. స్వామి వారికి తెపోత్సవం నిర్వహించే గండి చెరువును గోదావరి జలాలతో నింపనున్నారు. ఇవాళ్టి నుంచి జరిగే మహాసంప్రోక్షణ సమయానికి నీరు గండి చెరువులోకి దూకనున్నాయి.

Tags:    

Similar News