Maganti: మాగంటి కుటుంబ వివాదం మళ్లీ హాట్‌టాపిక్
శేరిలింగంపల్లి ఎమ్మార్వో ఆఫీస్‌కి మాగంటి ఫ్యామిలీ ఇష్యూ గోపినాథ్ మొదటి భార్యను తానంటూ మాలినీ దేవి స్టేట్‌మెంట్ గోపినాథ్ మరణానంతరం బయటకొచ్చిన మాలినీ దేవి, ప్రద్యుమ్న శేరి లింగంపల్లి ఎమ్మార్వో కార్యాలయానికి మాలినీ దేవి...
Maganti: మాగంటి కుటుంబ వివాదం మళ్లీ హాట్‌టాపిక్
మాగంటి ఫ్యామిలీ ఇష్యూ శేరిలింగంపల్లి ఎమ్మార్వో కార్యాలయానికి చేరింది. మాగంటి గోపినాథ్ మొదటి భార్యను తానే అంటూ మాలినీ దేవి స్టేట్‌మెంట్ ఇచ్చింది. గోపినాథ్ మరణానంతరం బీఆర్ఎస్ పార్టీ ఆయన భార్యకు టికెట్ ఇవ్వడంతో... మాలినీ దేవి, ఆమె కుమారుడు ప్రద్యుమ్న తారక్ మీడియా ముందుకు వచ్చారు. మాగంటి సునీతకు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.
అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని మాలినీ దేవితో పాటు మాగంటి గోపినాథ్ తల్లి మహానంద కుమారికి నోటీసులు పంపించారు. ఎమ్మార్వో పంపించిన నోటీసుల మేరకు వివరణ ఇచ్చేందుకు శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయానికి మాలిని దేవి, ప్రద్యుమ్న తారక్ వెళ్లారు. మాగంటి సునీత తరఫున ఆమె కుమార్తె దిశిర, లీగల్ అడ్వైజర్ లలితా రెడ్డి హాజరయ్యారు. వారిచ్చిన వివరణ మేరకు ఎమ్మార్వో నివేదికను తయారు చేయనున్నారు.