Madan Lal: తెలంగాణను బంగారు తెలంగాణ చేయటమే బీఆర్ఎస్ లక్ష్యం

Madan Lal: వైరా బీఆర్ఎస్ అభ్యర్థిగా తననే గెలిపించాలని మదన్‌లాల్ విజ్ఞప్తి

Update: 2023-10-30 10:35 GMT

Madan Lal: తెలంగాణను బంగారు తెలంగాణ చేయటమే బీఆర్ఎస్ లక్ష్యం

Madan Lal: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్ అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో ఇతర పార్టీలకు చెందిన 40 కుటుంబాలు మదన్ లాల్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మదన్‌లాల్. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరుతున్నారని అన్నారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ మార్చటమే ధ్యేయంగా పనిచేస్తున్నారని.. వైరా బీఆర్ఎస్ అభ్యర్థిగా తనను గెలిపించాలని మదన్‌లాల్ కోరారు.

Tags:    

Similar News