పిచ్చికుక్కుల స్వైరవిహారం..50 మంది విద్యార్థులకు గాయాలు

హైదరాబాద్ లో పిచ్చికుక్కులు స్వైరవిహారం చేస్తున్నాయి.

Update: 2020-01-21 14:31 GMT
పిచ్చికుక్కుల స్వైరవిహారం..విద్యార్థులకు గాయాలు

హైదరాబాద్ లో పిచ్చికుక్కులు స్వైరవిహారం చేస్తున్నాయి. పిచ్చికుక్కల దాడిలో దాదాపు 50మంది విద్యార్థులు గాయపడ్డారు. నగరంలోని అమీర్ పేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం అమీర్‌పేటలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులపై పిచ్చికుక్కలు దాడి చేసి గాయపరిచాయి. అమీర్ పేట దగ్గరలోని ధరమ్‌కరమ్ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులపై దాడి చేయడంతో స్థానికులు కుక్కలను వెంబడించి ఒక దానికి చంపారు.

ప్రభుత్వ పాఠశాల నుంచి తిరిగి వస్తున్న చిన్నారులపైకి కుక్కలు ఒక్కసారిగా పిచ్చి కుక్కలు మీదపడడంతో వారంతా భయభ్రంతులకు గురైయ్యారు. ఒకసారిగా విద్యార్థులంతా తోసుకొని ఒకరిపై ఒకరు పడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి బాధిత విద్యార్థులను ఫీవర్‌ ఆస్పత్రికి తరలించారు. పిచ్చి కుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

నగరంలోని అమీర్ పేట, ఎస్ ఆర్ నగర్ పరిధిలో వీధి కుక్కలు ఎక్కవగా రోడ్లపై సంచరిస్తు్న్నాయి. దీనిపై స్థానికులు అధికారులకు అనేక సార్లు ఫిర్యాదు చేశామని.. అధికారులు స్పందించడం లేదని వాపోతున్నారు. నిత్యం రద్దీగా ఉండే రోడ్లలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, పిల్లలు, మహిళలు, బయటకు రావాలంటే భయం వేస్తుందని, ఇకనైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

 

Tags:    

Similar News