Hyderabad: ఆ ప్రాంతంలో లాక్‌డౌన్ విధించే ఛాన్స్ ?

Hyderabad: దేశంలో కరోనా కేసులు భారీగానే నమోదవుతున్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ కోవిడ్ కల్లోలం కొనసాగుతుంది.

Update: 2021-05-09 13:57 GMT

జవహర్‌నగర్‌ (ఫొటో ట్విట్టర్)

Hyderabad: దేశంలో కరోనా కేసులు భారీగానే నమోదవుతున్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ కోవిడ్ కల్లోలం కొనసాగుతుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. అలానే తెలంగాణలో మాత్రం రాత్రి కర్ఫ్యూ విధించింది. కాగా, కేసులు ఎక్కువ ఉన్న కొన్ని ప్రాంతాల్లో తమకు తాముగా సెల్ఫ్ లాక్‌డౌన్ పాటిస్తున్నారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో కూడా పలు చోట్ల లాక్ డౌన్ పెడతారన్న వార్తులు వినిపిస్తున్నాయి. జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

కాగా, అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ పరిధిలో రోజూ 50 మందికి రాపిడ్‌ టెస్టులు చేస్తున్నారు. అందులో 20మందికి పాజిటివ్‌ లక్షణలుంటున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా ఉధృతి పెరుగుతుండటంలో జవహర్ నగర్ పాలకవర్గం లాక్‌డౌన్‌ దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు షాపులు మూసివేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. దీనిపై మంత్రి మల్లారెడ్డితో చర్చలు చేస్తున్నట్లు సమాచారం. రెండు, మూడు రోజుల్లో జవహర్‌నగర్‌లో లాక్‌డౌన్ పెట్టేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News