Telangana: లాక్ డౌన్ పేరిట లూటీ..

Telangana: లాక్‌డౌన్‌ ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌తో వ్యాపారులు జనాన్ని నిలువునా దోచుకుంటున్నారు.

Update: 2021-05-13 06:57 GMT

Telangana: లాక్ డౌన్ పేరిట లూటీ..

Telangana: లాక్‌డౌన్‌ ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌తో వ్యాపారులు జనాన్ని నిలువునా దోచుకుంటున్నారు. కరోనా కట్టడి కోసం ఉదయం 10 తర్వాత అత్యవసర సేవలు మినహా మిగతావి మూసివేయాలని ప్రభుత్వం సూచించింది. దీంతో ప్రజలు అవసరానికి మించి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు ధరలను అమాంతం పెంచేశారు. లాక్‌డౌన్‌ పేరిట లూటీ చేయడం ప్రారంభించారు. లాక్‌డౌన్‌ ప్రారంభమైన రోజే ధరలు పెంచేసి వినియోగదారుడికి చుక్కలు చూపించారు. రైతుబజార్‌తో పోల్చితే అన్ని కూరగాయలు రెట్టింపు ధరలకు అమ్మకాలు జరిగాయి.

కూరగాయాల ధరలే కాదు.. పళ్ళ ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. కరోనా వేళ ఖనిజాలు, లవణాలు అందించే వాటిని కొనాలంటే సామాన్యులు భయపడిపోతున్నారు. కిలో బాదం ధర వెయ్యి రూపాయలు అయ్యింది. వాల్‌ నట్స్‌ 1600కు తగ్గడం లేదు. కేజీ ఎండు ద్రాక్ష 500. కరోనాకు ముందు ఉండే ధరలు కంటే రెండింతలు పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు.

లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం ఆదేశాలను వ్యాపారులు బేఖాతర్‌ చేశారు. ఇష్టానుసారంగా ధరలను పెంచి సరుకులను విక్రయించారు. సామాన్య కుటుంబీకులకు కూరగాయలు కొనడం భారంగా మారింది. ప్రతినిత్యం పాలు ఎంతో అవసరం. వాటి ధర కూడా రెట్టింపు చేయడంతో ఏమి తోచని పరిస్థితి నెలకొంది. ధరలు ఎవరైనా పెంచి అమ్మినా, కృత్రిమ కొరత సృష్టించినా చర్యలు తీసుకోవాలని వినియోగాదారులు కోరుతున్నారు.

Full View


Tags:    

Similar News