మళ్లీ ప్రత్యక్షమైన చిరుతపులి..

గత వారం రోజులుగా హైదరాబాద్ నగర వాసులను భయభ్రాంతులను చేస్తున్న చిరుత మరో సారి దర్శనం ఇచ్చింది.

Update: 2020-05-19 04:51 GMT
Leopard in Hyderabad road (file photo)

గత వారం రోజులుగా హైదరాబాద్ నగర వాసులను భయభ్రాంతులను చేస్తున్న చిరుత మరో సారి దర్శనం ఇచ్చింది. ఇటీవల హిమాయత్‌సాగర్‌లో నీళ్లు తాగుతూ స్థానికులకు కనిపించిన చిరుత.. తాజాగా రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం హిమాయత్‌సాగర్‌ ఒడ్డున ఉన్న జీవీకే గార్డెన్స్‌లోని స్విమ్మింగ్‌ పూల్‌లో చిరుతపులి నీళ్లు తాగుతుండగా వాచ్‌మెన్‌ గమనించారు. వెంటనే వాచ్ మెన్ చిరుత కనిపించిన విషయాన్ని అధికారులకు తెలియజేసారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు, సిబ్బంది రంగంలోకి దిగి గార్డెన్‌లో కుక్కలను వదిలి చిరుత కోసం గాలిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రంలో మేకను ఎరవేసి బోనుతోపాటు, సీసీ ట్రాప్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు.

గత గురువారం అంటే మే 14వ తేదీన నగర శివారులోని కాటేదాన్‌ అండర్‌ బ్రిడ్జ్‌ వద్ద రోడ్డుపై చిరుతపులి కనిపించింది. సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకుని మత్తు ఇచ్చేలోపే తప్పించుకుని పారిపోయింది. రోడు పక్కనే ఉన్న ఫాంహౌస్‌లోకి వెళ్లిన చిరుతపులి, వ్యవసాయ యూనివర్సిటీలోని దట్టమైన పొదల్లోకి వెళ్లిపోయింది. ఆ తరువాత హిమాయత్ సాగర్ లో నీళ్లు తాగుతూ కొంత మందికి చిరుత కనిపించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు అప్పటి నుంచి అధికారులు చిరుత ఆచూకీ కోసం గాలిస్తున్నారు.


Tags:    

Similar News