మెదక్ జిల్లాలో చిరుత కలకలం
మెదక్ జిల్లాలో చిరుత కలకలం రేపింది. తూప్రాన్ మండలం ధాతర్‌పల్లి నుంచి మల్కాపూర్ మార్గంలో చిరుత సంచరిస్తుండటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
మెదక్ జిల్లాలో చిరుత కలకలం రేపింది. తూప్రాన్ మండలం ధాతర్‌పల్లి నుంచి మల్కాపూర్ మార్గంలో చిరుత సంచరిస్తుండటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ దారిలో చిరుత సంచరించడం ఇది రెండోసారి అని.. అటవీ అధికారులు స్పందించి బోన్లు ఏర్పాటు చేసి చిరుతను బంధించి జూపార్క్‌కు తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు.