Suryapet: కర్నల్ సంతోష్ బాబు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన కేటీఆర్‌

Suryapet: భారత్- చైనా సరిహద్దుల్లో విధి నిర్వహాణలో అమరుడైన కర్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని సూర్యాపేటలో అవిష్కరించారు.

Update: 2021-06-15 10:53 GMT

Suryapet: కర్నల్ సంతోష్ బాబు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన కేటీఆర్‌

Suryapet: భారత్ - చైనా సరిహద్దుల్లో విధి నిర్వహాణలో అమరుడైన కర్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని సూర్యాపేటలో అవిష్కరించారు. సూర్యాపేట పాత బస్టాండ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సంతోష్ బాబు 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు సంతోష్ బాబు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

విగ్రహావిష్కరణ సందర్భంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో గౌరవ సూచకంగా మిలట్రీ బ్యాండ్ వాయించారు. లద్దాఖ్ లో వాస్తవాధీన రేఖ వెంట గత ఏడాది జూన్ 15న చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో సంతోష్ బాబుతో పాటు మరికొందరు సైనికులు అమరులయ్యారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సంతోబాబు వీరోచిత పోరాట స్ఫూర్తి ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా సూర్యాపేటలో ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Full View


Tags:    

Similar News