KTR: పదవీ విరమణ చేస్తున్న సర్పంచ్ లకు కేటీఆర్ కృతజ్ఞతలు
KTR: 5 ఏళ్ల సేవలు మరువలేనివంటూ ట్వీట్
KTR: పదవీ విరమణ చేస్తున్న సర్పంచ్ లకు కేటీఆర్ కృతజ్ఞతలు
KTR: ఐదేళ్ల కాలంలో తెలంగాణ ప్రజానీకానికి సేవ చేసి పదవీ విరమణ చేస్తున్న సర్పంచ్‌లకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు మాజీ మంత్రి కేటీఆర్. కేసీఆర్ నాయకత్వంలో గ్రామాల్లో నర్సరీలు, పల్లె ప్రకృతివనాలు, వైకుంఠ దామాలు నెలకొల్పడంలో దేశానికి ఆదర్శంగా నిలిచారని కేటీఆర్ సర్పంచ్ లను కొనియాడారు. సర్పంచ్ పదవికి మాత్రమే విరమణ అని ప్రజాసేవకు కాదన్నారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.