KTR: వేలాడే తుపాకి సైలెంట్‌గానే ఉంటుంది - కేటీఆర్

KTR: ఆనాడు ఉద్యమ సమయంలో తెలంగాణను వ్యతిరేకించిన వారు ఇవాళ కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు మంత్రి కేటీఆర్.

Update: 2021-03-06 10:18 GMT

వేలాడే తుపాకి సైలెంట్‌గానే ఉంటుంది: కేటీఆర్

KTR: ఆనాడు ఉద్యమ సమయంలో తెలంగాణను వ్యతిరేకించిన వారు ఇవాళ కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. అడ్రస్ లేని వాళ్లంతా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఉద్యమ కాలంలో ముఖ్యమంత్రులను ఉరికించిన చరిత్ర టీఆర్ఎస్‌ విద్యార్థి విభాగానికి ఉందని.. మాటలే మాట్లాడాలంటే తగిన సమాధానం చెప్పడానికి తాము కూడా సిద్ధమని హెచ్చరించారు. గోడకు వేలాడదీసే తుపాకీ సైతం మౌనంగానే ఉంటుంది.. సమయం వచ్చినప్పుడు దాని విలువ తెలుస్తుందని ప్రతిపక్షాలకు చురకలంటించారు. కేసీఆర్‌ మౌనాన్ని ఎవరూ తక్కువ అంచనా వేయొద్దని ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందో యావత్‌ తెలంగాణకు తెలుసన్నారు. ఏప్రిల్‌ 27 నాటికి టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించి 2 దశాబ్దాలని ఆయన గుర్తుచేశారు. ఉద్యమ పార్టీగా టీఆర్‌ఎస్‌ ప్రజల గుండెల్లో నిలిచిందని పేర్కొన్నారు.

Tags:    

Similar News