KTR: సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ రక్షణ కవచంగా నిలుస్తుంది
KTR: సీఎం రేవంత్‌రెడ్డిని బీజేపీ కాపాడుతోందంటూ హాట్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
KTR: సీఎం రేవంత్‌రెడ్డిని బీజేపీ కాపాడుతోందంటూ హాట్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డికి బిజెపి రక్షణ కవచంగా నిలుస్తుందన్నారు. అమృత్ టెండర్ల స్కామ్ నుంచి మొదలుకొని సివిల్ సప్లైస్ స్కామ్ వరకు కేంద్ర ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించి స్కామ్ లకు పాల్పడుతున్నా రేవంత్‌ను కాపాడుతూ వస్తున్నారని ఆరోపించారు కేటీఆర్.
సాక్ష్యాధారాలతో సహా అనేకసార్లు కేంద్రానికి ఫిర్యాదు చేసినా మౌనం వహిస్తున్నారన్నారు. గతంలో కాళేశ్వరం ప్రమాదంపై ఆగమేఘాలపై స్పందించిన కేంద్రం.. మొన్న సుంకిశాల ప్రమాదంపై కానీ, SLBC టన్నెల్ ప్రమాదంపై స్పందించడం లేదని ఆరోపించారు. సరైన సమయంలో రేవంత్ బిజెపిలో చేరతానని హమీ ఇవ్వడం వల్లనే కేంద్రం ఆయనను కాపాడుతుందనే అనుమానం వ్యక్తం అవుతుందన్నారు కేటీఆర్.