KTR: ప‌వ‌ర్‌లూమ్ వ‌స్త్ర ప‌రిశ్ర‌మ‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వం అండ‌గా నిల‌వాలి

KTR: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంపై స్పందించిన కేటీఆర్‌

Update: 2024-01-16 05:05 GMT

KTR: ప‌వ‌ర్‌లూమ్ వ‌స్త్ర ప‌రిశ్ర‌మ‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వం అండ‌గా నిల‌వాలి

KTR: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై వస్తు్న్న సంక్షోభ వార్తలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గత పదేళ్లలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పుకొచ్చారు. ఎంతో నైపుణ్యం కలిగిన పవర్‌లూమ్ నేతన్నలు అభివృద్ధితో పాటు తమ కార్యకలాపాలు విస్తరించారని తెలిపారు.

గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన సహకారమే ఇందుకు ప్రధాన కారణమని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పవర్‌లూమ్ వస్త్ర పరిశ్రమకు అండగా నిలవాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన వివిధ కార్యక్రమాలను కొనసాగిస్తూనే.. వస్త్ర పరిశ్రమ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలోకి వెళ్తుందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News