Medak: డ్రగ్స్ వాడొద్దు.. జీవితాలను నాశనం చేసుకోవద్దు కలెక్టర్ ప్రతిమా సింగ్

Medak: మెదక్‌లో "డ్రగ్స్ కంట్రోల్ & రెగ్యులేటరీ స్ట్రెంథనింగ్ డే" సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు.

Update: 2026-04-11 11:15 GMT

Medak: డ్రగ్స్ వాడొద్దు.. జీవితాలను నాశనం చేసుకోవద్దు కలెక్టర్ ప్రతిమా సింగ్

Medak: 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' హెల్త్ వీక్ లో భాగంగా "డ్రగ్స్ కంట్రోల్ & రెగ్యులేటరీ స్ట్రెంథనింగ్ డే"మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు మరియు యువతలో చైతన్యం నింపేందుకు మెదక్ జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తా నుండి మెదక్ టీ.ఎన్ జీవో భవన్ వరకు అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ ప్రారంభించారు.

అనంతరం టీ ఎన్జీవో.వో భవన్లో సమావేశ మందిరంలో అవగాహన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, డి సి హెచ్ ఎస్ శివ దయాల్, పోలీస్, హెల్త్ సిబ్బంది తో కలిసి నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగాన్ని మూకుమ్మడి అరికట్టాలని, విచ్చలవిడిగా డ్రగ్స్ వాడొద్దని, మెడికల్ షాపుల్లో అమ్మే మందులకు, గోలీలకు డాక్టర్ పిస్క్రిప్షన్ తప్పనిసరిగా ఉండాలన్నారు. పాఠశాల స్థాయిల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్ డి ఓ రమాదేవి, జిల్లా వైద్యాధికారి శ్రీరామ్, డిసిహెచ్ శివదయాల్, డీఎస్పీ ప్రసన్నకుమార్, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు రాజు, మెడికల్ షాప్ యజమానులు, ఫార్మసీ విద్యార్థులు, పాల్గొన్నారు.వివిధ పోటీలలో గెలుపొందిన ఫార్మసీ విద్యార్థులకు ప్రశంసా పత్రం, షీల్డ్ ను బహుకరించి అభినందించారు.

Tags:    

Similar News