KTR on Household Internet Facility: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ ఇంటర్నెట్‌ సౌకర్యం

KTR on Household Internet Facility: తెలంగాణ ప్రజలకు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తీపికబురు చెప్పారు.

Update: 2020-07-08 04:45 GMT
KTR (File Photo)

KTR on Household Internet Facility: తెలంగాణ ప్రజలకు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తీపికబురు చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేటలో 307 మంది గిరిజన రైతులకు మంగళవారం పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీ-ఫైబర్‌ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇండ్లకి ఇంటింటికీ ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పిస్తామని ఆయన అన్నారు. ఇంటింటికీ ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో టీ-ఫైబర్‌ పనులను వేగవంతంగా కొనసాగిస్తున్నామని తెలిపారు.

సీఎం కేసీఆర్ భవిష్యత్ తరాల గురించి ఆలోచించి హరితహారం ద్వారా పెద్దఎత్తున మొక్కలు నాటిస్తున్నారని తెలిపారు. దీని ద్వారా రాబోయే కాలంలో పుట్టే పిల్లలకు స్వచ్చమైన గాలి, ఆక్సిజన్‌ అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. అడవులను పెంచడానికి రాష్ట్రం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, అలాంటిది ఎవరైనా అడవులను నరికితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అడవులను నిరికితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

 రైతులకు దీర్ఘకాల మేలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు కేటీఆర్. కరోనా కష్టసమయంలో సైతం రైతు బందు అందజేశామని తెలిపారు మంత్రి. కృష్ణా, గోదావరి నదుల్లో న్యాయమైన నీటి వాటాను కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల ద్వారా వాడుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయాన్ని పండగ చేయడమే కేసీఆర్ లక్ష్యమని వ్యాఖ్యానించారు. కృష్ణా, గోదావరి నదుల్లో న్యాయమైన వాటాను కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల ద్వారా వాడుకుంటున్నామన్నారు. వచ్చే నాలుగేళ్లలో ఎలాంటి ఎన్నికలు లేవని, అభివృద్ధిపైనే దృష్టి సారిస్తామని తెలిపారు.

Tags:    

Similar News