KTR: అసెంబ్లీలోని BRSLP సమావేశం.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన కేటీఆర్
KTR: ఎదురుదాడికి సిద్ధమవుతోన్న బీఆర్ఎస్ నేతలు
KTR: అసెంబ్లీలోని BRSLP సమావేశం.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన కేటీఆర్
KTR: అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్షం సమావేశమైంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్ సమావేశం అయ్యారు. ఇవాళ గవర్నర్ ప్రసంగం ఉండడంతో.. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. గత ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృషి సారించడంతో బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి సిద్ధపడుతున్నట్టు సమాచారం. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రాలు విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించడంతో.. అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలన్న దానిపై చర్చిస్తున్నారు.