KTR: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అందుతున్నది శూన్యం
KTR: కేంద్ర బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించాలి
KTR: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అందుతున్నది శూన్యం
KTR: తెలంగాణ టెక్స్ టైల్ రంగానికి కేంద్ర బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. నేతన్నల సంక్షేమం, టెక్స్‌టైల్ రంగ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని ఎన్నో ఏళ్లుగా కోరుతున్నామని అయినా కేంద్రం సహకారం లభించడం లేదని కేటీఆర్ ఆరోపించారు. ఆర్థిక మంత్రులు మారుతున్నా కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అందుతున్నది శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సారైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ టెక్స్‌టైల్ రంగ పురోగతికి నిధులు ఇస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.